మెగా అభిమానులకు పండగ చేసుకునే వార్త..!

chiranjeevi upcoming movies

mega star chiraneevi

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో స్పీడందుకున్నాడు. ఖైదీ నంబర్ 150 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు తరువాత పాన్ ఇండియా సినిమా సైరా నరసింహారెడ్డిలో నటించాడు. ఈ రెండు సినిమాల తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే సినిమాలను వరుసగా లైన్లో పెడుతున్నాడు.

మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ను తెలుగులో రీమేక్ చేసేందుకు ఓకె చెప్పాడు చిరు. ఈ సినిమా తరువాత మరోసారి పాన్ ఇండియా లెవల్లో ఓ భారీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడట. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు చిరు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. శంకర్ తొలి సినిమా జెంటిల్మెన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్న చిరు.భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న శంకర్ చిరంజీవితో మూవీ చేయాలని, చాలా కాలంగా అనుకుంటున్నారు. ఐతే ఆ కాంబినేషన్ ఇప్పటి వరకు సెట్ కాలేదు. ఐతే శంకర్ మొదటి చిత్రం జెంటిల్ మెన్ హిందీ రీమేక్ లో చిరంజీవి నటించారు. అల్లు అరవింద్ నిర్మాతగా 1993లో వచ్చిన ఆ మూవీకి బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించారు.

ఐతే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు బడా నిర్మాతలు వీరితో మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నారట. ఓ భారీ పాన్ ఇండియా మూవీ వీరి కాంబినేషన్ లో తెరకెక్కించాలని వారు భావిస్తున్నారని సమాచారం.దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య మూవీలో నటిస్తున్నారు.

శంకర్ చిరంజీ కోసం మాస్ కథ ని సిద్దం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో వచ్చిన రౌడీ అల్లుడు తరహాలో కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించడానికి స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడట. చిరంజీవి రీ ఎంట్రీ మూవి ఖైదీ నంబర్ 150 లో డ్యూయల్ రోల్ లో నటించిన చిరంజీవిని మళ్ళీ హరీష్ శంకర్ డ్యూయల్ రోల్ లోనే చూపించబోతున్నట్టు తెలుస్తుంది. రెండు పాత్రలు ఒకదానికి ఒకటి సంబధం లేకుండా ఒకటి క్లాస్ క్యారెక్టర్ ఒకటి పక్కా మాస్ క్యారెక్టర్ గా రూపొందించనున్నారని తెలుస్తుంది. ఇక గతంలో ను చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళు సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసందే. అలాగే కొన్ని సినిమాలలో డ్యూయల్ రోల్ లో నటించి సూపర్ హిట్స్ ని అందుకున్నారు

0 Reviews

Write a Review

admin

Read Previous

రామ్ చరణ్ సినిమాకు నిర్మాతగా మహేష్ బాబు

Read Next

Vontae Davis Quit on the Bills at Halftime, Changed into

Leave a Reply